Rashmika: రష్మికను బ్యాన్ చేసిన ఇండస్ట్రీ.. నిజమేనా?

Rashmika: రష్మికను బ్యాన్ చేసిన ఇండస్ట్రీ.. నిజమేనా?

Arun Chilukuri
Published on: 25 Nov 2022 1:21 PM IST
Kannada Industry Banned Rashmika Mandanna
X

Rashmika: రష్మికను బ్యాన్ చేసిన ఇండస్ట్రీ.. నిజమేనా?

Rashmika Mandanna: కన్నడ "కిరిక్ పార్టీ" సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ లో బిజీగా ఉండే హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలూ చేస్తోంది. ఇకపోతే కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్‌ అందుకున్న రష్మిక తన సొంత ఇండస్ట్రీని చులకన చేసిందంటూ నెట్టింట తెగ ట్రోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించిన చిత్రం 'కాంతార'. అయితే ఇంతవరకూ ఈ సినిమా చూడనేలేదని, అంత టైం లేదని చెప్పిందీ ఈ భామ. అంతేకాదు, ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి చెప్పేటప్పుడు సోకాల్డ్‌ బ్యానర్‌లో చేశానంటూ నిర్మాణ సంస్థ పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఆమె కన్నడ పరిశ్రమని అగౌర పరిచిందని, అందుకు ఆమె మీద చాల ట్రోలింగ్‌ జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే, రష్మిక ని మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ నిషేదించింది అని అంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story