చిరంజీవి సర్జా కటౌట్‌తో భార్య మేఘనారాజ్ సీమంతం!

Meghana Raj Seemantha Ceremony : ప్రముఖ క‌న్నడ హీరో, దివంగత చిరంజీవి స‌ర్జా శ్రీమతి మేఘనారాజ్ ఇటీవల సీమంతం వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలలో తన భర్త చిరంజీవి సర్జా ఫోటోను తన పక్కన పెట్టుకొని భర్త మీదున్న ప్రేమను తెలియజేశారు.

Krishna
Published on: 5 Oct 2020 4:54 PM IST
చిరంజీవి సర్జా కటౌట్‌తో భార్య మేఘనారాజ్ సీమంతం!
X

Meghana Raj Seemantha Ceremony : ప్రముఖ క‌న్నడ హీరో, దివంగత చిరంజీవి స‌ర్జా శ్రీమతి మేఘనారాజ్ ఇటీవల సీమంతం వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలలో తన భర్త చిరంజీవి సర్జా ఫోటోను తన పక్కన పెట్టుకొని భర్త మీదున్న ప్రేమను తెలియజేశారు. ఆ సీమంతం వేడుకల ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఈ వేడుకకి ఆమె సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శ్వాస‌కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చిరంజీవి సర్జా గత జూన్‌లో చనిపోయారు. కాగా వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు కావడం విశేషం..

ఇక చిరంజీవి స‌ర్జా 2009లో వాయుపుత్ర సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. చిరంజీవి సర్జా దాదాపుగా 25 సినిమాలలొ నటించాడు. ఇక 2018లో కన్నడ హీరోయిన్ మేఘనా రాజ్‌ను అయన పెళ్లి చేసుకున్నాడు. అటు మేఘనా రాజ్‌ టాలీవుడ్ లో అల్లరి నరేష్‌తో హీరోగా నటించిన బెండు అప్పారావు సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఇక తన భర్తతో కలిసి మేఘనా రాజ్‌ 'ఆటగార' అనే సినిమాలో నటించింది. సీనియర్‌ సినీనటులైన సుందర్‌రాజ్, ప్రమీలా జోషాయ్‌ దంపతుల కుమార్తెనే ఈ మేఘనా రాజ్...


Krishna

Krishna

Next Story