SSMB 28: మహేష్ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర..

SSMB 28: ఈ మధ్యనే పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్..

Arun Chilukuri
Published on: 6 July 2022 2:24 PM IST
Kannada Actor Upendra Play Key Role Mahesh Babu Film
X

SSMB 28: మహేష్ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర..

SSMB 28: ఈ మధ్యనే పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బోలెడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా ఈ సినిమాలో నటించనున్న నటీనటుల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరో నాని కీలక పాత్రలో కనిపించనున్నారు అనే వార్త ఈమధ్య ఇండస్ట్రీలో తెగ వినిపించింది. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అని దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఉపేంద్ర మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో "సన్ ఆఫ్ సత్యమూర్తి" సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన ఉపేంద్ర తాజాగా ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో హీరో తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ మరియు డైలాగ్ వెర్షన్ పూర్తయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story