కన్నడ హీరో పునీత్ రాజ్ పరిస్థితి విషమం.. గుండెపోటుతో ఐసీయూలో చికిత్స

Puneeth Rajkumar: ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Arun Chilukuri
Updated on: 29 Oct 2021 1:52 PM IST
కన్నడ హీరో పునీత్ రాజ్ పరిస్థితి విషమం.. గుండెపోటుతో ఐసీపీయూలో చికిత్స
X

కన్నడ హీరో పునీత్ రాజ్ పరిస్థితి విషమం.. గుండెపోటుతో ఐసీపీయూలో చికిత్స

Puneeth Rajkumar: ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. పునీత్‌ ఆరోగ్యం గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.

పునీత్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. పునీత్‌ సోదరుడు శివరాజ్‌ కుమార్‌, కన్నడ నటీనటులు ఆస్పత్రికి చేరుకున్నారు. మరోవైపు పునీత్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలివస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story