Kanguva Twitter Review: 'అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు'.. కంగువా ట్విట్టర్‌ రివ్యూ వచ్చేసింది..!

Kanguva Twitter Review: సూర్య హీరోగా తెరకెక్కిన కంగువా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 14 Nov 2024 12:24 PM IST
Kanguva Twitter Review
X

Kanguva Twitter Review

Kanguva Twitter Review: సూర్య హీరోగా తెరకెక్కిన కంగువా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఎన్నో అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువాను సూర్య ఎంతో ఛాలెంజింగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇందుకు అనుగుణంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను కూడా ఓ రేంజ్‌లో చేసింది.

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. మరి ఇన్ని అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది.? సూర్య కష్టానికి ఎలాంటి ఫలితం లభించింది. లాంటి వివరాలను ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం.

కంగువా మూవీ చూసిన నెటిజన్లు చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో ఫైట్స్‌, విజువల్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఇక సినిమాలో అదిరిపోయే సర్ ప్రైజ్‌లకు కొదవ లేదని అంటున్నారు. సూర్య కెరీర్‌లో ది బెస్ట్‌ మూవీస్‌లో కచ్చితగా కంగువా ఒకటిగా నిలుస్తుందని ఎక్స్‌ వేదికగా ట్విట్స్‌ చేస్తున్నారు.

ఇక మరో యూజర్‌ స్పందిస్తూ.. కంగువాలో కొన్ని సీన్స్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయని తెలిపారు. ఈ సినిమా పక్కా పైసా వసూల్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సూర్య యాక్టింగ్, దేవీశ్రీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాను ఓ రేంజ్‌ను తీసుకెళ్లిందని ట్వీట్ చేశారు. అలాగే సినిమాలో దిశా పటానీ గ్లామర్‌ కూడా బాగుందని మరో యూజర్‌ కామెంట్ చేశాడు.

కంగువ ప్రీమియర్‌ చూసిన మరో యూజర్‌ స్పందిస్తూ.. రెండు తరాల్లో జరిగే కథతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. ఫ్లాష్ బ్యాక్ స్టోరి కొంత స్లోగా అనిపించినా విజువల్స్ అద్బుతంగా ఉన్నాయని, క్లైమాక్స్ చాలా బాగుందని కామెంట్‌ చేశాడు. ఇక మరికొందరు ఫస్టాఫ్‌ కాస్త స్లో నరేషన్‌ ఉందని అన్నా ఓవరాల్‌గా సెకండాఫ్‌ వచ్చే సరికి సినిమాకు పాజిటివ్‌ బజ్‌ వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Also Read: Kanguva Movie First Review: కంగువా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..?





హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story