మళ్లీ ప్రభాస్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

మళ్లీ ప్రభాస్ తో సినిమా చేయాలని ఉంది అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్
x

కంగనా రనౌత్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Kangana Ranaut - Prabhas: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన కంగనారనౌత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే

Kangana Ranaut - Prabhas: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన కంగనారనౌత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ప్రభాస్ హీరోగా నటించిన "ఏక్ నిరంజన్" సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది కంగనా. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఈమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఆ తరువాత "తను వెడ్స్ మను", "క్వీన్" వంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కంగనారనౌత్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నాకు మళ్ళీ తెలుగు సినిమా చేయాలని ఉంది. ప్రభాస్ కనుక ఛాన్స్ ఇస్తే నాకు కచ్చితంగా చేస్తాను. పూరి జగన్నాథ్ గారికి కూడా ఇదే విషయాన్ని చెప్పాను. నాకు మళ్ళీ ప్రభాస్ తో కలిసి సినిమా చేయాలని ఉంది," అని చెప్పుకొచ్చింది కంగనారనౌత్. "బాహుబలి", "సాహో" సినిమా లతో ప్రభాస్ బాలీవుడ్ లో సైతం మంచి పేరు తెచ్చుకొని ప్యాన్ ఇండియన్ హీరోగా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో మళ్ళీ సినిమా చేయడానికి సిద్ధం అంటోంది కంగనా. మరోవైపు ఈ మధ్యనే తమిళ్ నాడు మాజీ చీఫ్ మినిస్టర్ జయలలిత బయోపిక్ "తలైవి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా.

Show Full Article
Print Article
Next Story
More Stories