Thalaivi Movie: థియేటర్స్ లోనే కంగనా మూవీ 'తలైవి'

Thalaivi Movie కంగనా నటించిన సినిమా తలైవి ని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే రిలీజ్ అని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Kranthi
Published on: 4 Jun 2021 10:34 AM IST
Kangana Ranaut Thalaivi Movie Updates | Thalaivi Movie Release Date
X

Thalaivi Movie:(The Hans India) 

Thalaivi Movie: తలైవి.. అమ్మ సినిమా.. తమిళ తంబీలు ఆత్రంగా ఎదురు చూస్తోన్న సినిమా. అన్నాడీఎంకె ఓడిపోయినా.. డీఎంకె గెలిచినా.. ఇప్పుడు రెండు పార్టీలకు జయలలిత ఇమేజ్ అవసరం పడింది. అందుకే అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కంగనా ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన సినిమా తలైవి. ఈ సినిమా రిలీజ్ కోవిడ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నా.. థియేటర్లు ఓపెన్ అయ్యాకే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పట్టుబడుతోందంట.

దివంగత నటి ,రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగన జయలలిత పాత్రలో కనిపించనుంది. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసింది. తెలుగు తమిళం కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో కథానాయికగా విభిన్న పాత్రలు పోషించారు జయలలిత.

జయలలిత జీవితంలోని ప్రధాన అంశాలు ఈ సినిమాలో ఉంటాయట. జయలలిత పదహారేళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్ లో చూపించనున్నారు. కరోనా తగ్గిన వెంటనే అంటే థియేటర్స్ తెరచుకోగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అదే విధంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్రబృందం. కానీ కోవిడ్ వలన సినిమా వాయిదా పడటంతో తలైవి రిలీజ్ పై డిఫరెంట్ టాక్స్ వినిపిస్తున్నాయి.

Kranthi

Kranthi

Next Story