Kangana Ranaut: నేను రాజమౌళి ఫ్యాన్ ని అంటున్న కంగనా రనౌత్

Kangana Ranaut: రాజమౌళి ప్రశంసల వర్షం కురిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Rama Rao
Updated on: 31 March 2022 8:00 AM IST
Kangana Ranaut Praises RRR Director SS Rajamouli | Tollywood News
X

Kangana Ranaut: నేను రాజమౌళి ఫ్యాన్ ని అంటున్న కంగనా రనౌత్ 

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనారనౌత్ ఎప్పటికప్పుడు తన స్టేట్ మెంట్ లతో వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. అయితే తాజాగా కంగనా ఒక తెలుగు డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఎస్ ఎస్ రాజమౌళి. ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా చూసిన కంగనారనౌత్ ఈ సినిమా చూసే ముందే సోషల్ మీడియా వేదికగా రాజమౌళి గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"ఆయనలో గొప్ప విషయం ఆయన సక్సెస్ మాత్రమే కాదు ఒక కళాకారుడిగా ఆయన వినయం, సింప్లిసిటీ, మరియు సినిమా అంటే ఆయనకున్న ప్రేమ. మీలాంటి ఒక రోల్ మోడల్ ఉండడం చాలా సంతోషంగా ఉంది సార్. నేను నీ ఫ్యాన్ ని," అని రాసుకొచ్చింది కంగనా. నిజానికి కరణ్ జోహార్ కాకుండా ఈ సినిమా గురించి నోరు విప్పిన మొట్టమొదటి సెలబ్రిటీ కంగనా నే. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు సినిమా సక్సెస్ గురించి మౌనంగా ఉన్నప్పటికీ కంగనా మాత్రం సినిమా గురించి రాజమౌళి గురించి పోస్ట్ చేయటం తో అభిమానులు కూడా ఆమెను ప్రశంసిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story