logo

హారర్ సినిమాతో ఏడిపించనున్నారా

హారర్ సినిమాతో ఏడిపించనున్నారా
Highlights

కాంచన సిరీస్లో మూడవ భాగంగా 'కాంచన 3' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్...

కాంచన సిరీస్లో మూడవ భాగంగా 'కాంచన 3' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడమే కాక ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. సినిమా రేపు అనగా ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్లు భారీగానే జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న సాయంత్రం 'కాంచన 3' పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది చిత్రబృందం.

కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే మెప్పించే విధంగా కాకుండా అందరిని కన్నీళ్లు పెట్టించేలా చేస్తుందని ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని ఎందుకంటే ఒకవైపు భయపడుతూనే మరొకవైపు సెంటిమెంట్ పండించారని చెబుతున్నారు. 'కాంచన 2 (గంగ)' సినిమాలతో పోలిస్తే సెంటిమెంట్ కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.'గంగ' లో నిత్యమీనన్ పాత్రలాగా ఈ సినిమాలో కూడా కొన్ని మనసుకు హత్తుకునే పాత్రలు, ఎమోషన్లు భారీగా ఉన్నాయని ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అందరి కళ్ళల్లోనూ నీరు తెప్పిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా నాని 'జెర్సీ' సినిమాతో క్లాష్ అయిపోతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరుకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

లైవ్ టీవి

Share it
Top