నాని ని భయపెడుతున్న కాంచన

నాని ని భయపెడుతున్న కాంచన
x
Highlights

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ లను చవిచూసిన నాచురల్ స్టార్ నాని ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే కసితో 'జెర్సీ' అనే...

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ లను చవిచూసిన నాచురల్ స్టార్ నాని ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే కసితో 'జెర్సీ' అనే సినిమాతో త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా వచ్చే నెల 19వ తారీఖు న విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇంకా ముందుకు జరిపి ఏప్రిల్ 17వ తారీఖున విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఒక డబ్బింగ్ సినిమా నుంచి గట్టి పోటీ ఏర్పడింది. ఎందుకంటే లారెన్స్ నటించిన 'కాంచన 3' సినిమా తమిళ్ లో ఏప్రిల్ 19న విడుదల కానుంది.

తెలుగులో కూడా అదే రోజు విడుదల అవుతుంది అని అంచనా. కాంచన సిరీస్ లో మూడవ సినిమా గా తెరకెక్కనున్న ఈ హారర్ సినిమా మిగతా హారర్ సినిమాల కంటే కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈసారి లారెన్స్ ఈ సినిమాలో వృద్ధ గెటప్ లో కనిపించడమే కాక పాముల బ్యాక్ డ్రాప్ ను కూడా వాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటిదాకా విడుదలైన 'ముని', 'కాంచన', 'గంగ' సినిమా లు బాగానే హిట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకం అందరిలోనూ ఉంది. తెలుగు వెర్షన్ విడుదల పై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి ఈ సినిమాను తట్టుకొని 'జెర్సీ' హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories