నితిన్ కి సలహా ఇచ్చిన కమల్ హాసన

Kamal Hassan Vikram Pre- Release Event
x

నితిన్ కి సలహా ఇచ్చిన కమల్ హాసన

Highlights

Kamal Hassan: వెంకటేష్ ని చూసి నేర్చుకోండి అంటూ నితిన్ కి సలహా ఇచ్చిన కమల్ హాసన్

Kamal Hassan: కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ మధ్యనే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఇక వీరిద్దరూ ఈ వేడుకలో మాట్లాడుతూ కమల్ హాసన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసి కమల్ హాసన్ ను ఆకాశానికి ఎత్తేశారు.

టాలీవుడ్ హీరో నితిన్ కూడా చిత్ర ఈవెంట్కి విచ్చేశారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ నితిన్కి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. "నన్ను చూసి మీరేమీ నేర్చుకో కండి. మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే వెంకీని చూడండి. మీరు తప్పకుండా సూపర్స్టార్ అవుతారు" అని సలహా ఇచ్చారు కమలహాసన్. "వెంకటేష్ లాగా నేను కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టి ఉంటే పాడైపోయే వాడిని. వెంకీ లా కష్టపడి స్టార్ట్ అయ్యే వాడిని కాదు.

అందుకే నితిన్ ఈ విషయంలో వెంకీ ని ఆదర్శంగా తీసుకోవాలి" అని అన్నారు కమల్ హాసన్. గతంలో కమల్ హాసన్ మరియు వెంకటేష్ కలిసి "ఈనాడు" అనే సినిమాలో నటించారు. అయితే మళ్ళీ ఈ వేడుకలో మాట్లాడుతూ వెంకటేష్ కమల్ హాసన్ తో ఒక పూర్తి స్థాయి సినిమా చేయాలని ఉంది అని తన మనసులోని మాటను బయట పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories