'భారతీయుడు 2' షూటింగ్ కి మరొక అంతరాయం

భారతీయుడు 2 షూటింగ్ కి మరొక అంతరాయం
x
Highlights

ఈ మధ్యనే '2.0' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ఇప్పుడు 'భారతీయుడు' సీక్వెల్ గా 'భారతీయుడు 2' సినిమా తీయడంలో బిజీగా ఉన్న సంగతి...

ఈ మధ్యనే '2.0' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ఇప్పుడు 'భారతీయుడు' సీక్వెల్ గా 'భారతీయుడు 2' సినిమా తీయడంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే గత కొంతకాలంగా బడ్జెట్ బాగా పెరిగిపోవడం వల్ల లైకా సంస్థ ఈ సినిమాని ఆపేయనున్నట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. ఆ ప్రచారం ఇప్పటికీ సాగుతూనే ఉంది కానీ ఈ సినిమా దర్శక నిర్మాతలు మాత్రం ఏ విషయాన్ని బయటకు చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కి మరొక అడ్డంకి ఏర్పడిందట. 'భారతీయుడు 2' సినిమా షూటింగ్ ఆపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

దీనికి కారణం కమల్ హాసన్ రాజకీయాలలో బిజీగా ఉండటం అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం బడ్జెట్ పరంగా వెనకాడుతున్న లైకా వారు సినిమాను నిలిపివేశారని మరికొందరు అంటున్నారు. ఈ కారణాలను పక్కనపెట్టి మరికొందరు మాత్రం కొత్త కథలు వినిపిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ కు ప్రోస్తెటిక్ మేకప్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం మేకప్ వేయడానికి నాలుగైదు గంటలు కేటాయించాల్సి వస్తోంది. అయితే ఈ మేకప్ లో ఒక కెమికల్ తన శరీరానికి పడకపోవడంతో కమల్ కు ఎలర్జీ వచ్చిందట. ఈ కారణం వల్లనే సినిమా షూటింగ్ కొన్నాళ్ళు నిలిపివేశారని కొందరు చెబుతున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ మళ్ళి ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories