'విక్రమ్‌' బాక్సాఫీస్‌ వేట.. ఐదేళ్లకు బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన తమిళ సినిమా..

Vikram Movie:బాహుబ‌లి పేరిట ఉన్న 5ఏళ్ళ‌ రికార్డును విక్ర‌మ్ కేవ‌లం 15 రోజుల్లోనే బ్రేక్ చేసింది .

Arun Chilukuri
Updated on: 19 Jun 2022 3:17 PM IST
Kamal Haasan Vikram Beat Baahubali 2 Tamil Nadu
X

‘విక్రమ్‌’ బాక్సాఫీస్‌ వేట.. ఐదేళ్లకు బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన తమిళ సినిమా..

Vikram Movie: "ఖైదీ", "మాస్టర్" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఇప్పుడు "విక్రమ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో మరియు మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ ముఖ్య పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 3, 2022 న థియేటర్లలో విడుదలై మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ తో ముందుకు దూసుకు వెళుతోంది.

విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుల అంచనా. ఈ మొత్తం కలెక్షన్స్‌లో సగం అంటే రూ.150 కోట్లు కేవలం తమిళనాడు నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో ఉన్న 'బాహుబలి-2' కలెక్షన్స్‌ రికార్డుని 'విక్రమ్‌' బద్దలు కొట్టింది. తమిళనాట బాహుబలి 2 లైఫ్‌టైం కలెక్షన్స్ అయిన రూ.155 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి విక్రమ్ సినిమా మరింత ముందుకు వెళుతోంది.

బాహుబ‌లి పేరిట ఉన్న 5ఏళ్ళ‌ రికార్డును విక్ర‌మ్ కేవ‌లం 15 రోజుల్లోనే బ్రేక్ చేసి.. త‌మిళంలో ఇప్పుడు సరికొత్త ఇండ‌స్ట్రీహిట్‌గా, టాప్ గ్రాసర్ గా అవతరించింది. ఇక ఈ త‌మిళ సినీ పరిశ్రమలో లో రూ.150 కోట్ల క్ల‌బ్‌లో చేరిన మొద‌టి సినిమాగా విక్ర‌మ్ రికార్డు సృష్టించింది. అయితే ఫుట్ ఫాల్స్ విషయంలో మాత్రం ఇంకా బాహుబలి టాప్ లోనే ఉండడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story