Big Boss: బిగ్ బాస్ నుంచి కమల్ హాసన్ ఔట్? రేసులో శింభు..

Big Boss: బిగ్ బాస్ నిస్సందేహంగా దేశంలో అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటి. హిందీ లో గత పదేళ్ల నుంచి విజయవంతంగా నడుస్తోంది.

Venkata Chari
Published on: 25 March 2021 8:48 PM IST
Kamal Haasan to quit Bigg Boss?
X

కమల్ హాసన్ (ఫొటో హన్స్ ఇండియా)

Big Boss: బిగ్ బాస్ నిస్సందేహంగా భారతదేశంలో అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటి. హిందీ బిగ్ బాస్ గత 10 సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్లలో ఎక్కువ భాగం హోస్ట్ గా చేసింది మాత్రం సల్మాన్ ఖాన్.

తెలుగు బిగ్ బాస్ నాలుగు సీజన్లలో మూడు సీజన్లకు ముగ్గురు హోస్ట్ లు పాల్గొన్నారు. మరోవైపు, కమల్ హాసన్ మొదటి సీజన్ నుంచి తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తున్నారు. కానీ, తాజా నివేదికల ప్రకారం, కమల్ హాసన్ రాబోయే బిగ్ బాస్ సీజన్‌కు ఆతిథ్యం ఇవ్వడం లేదంట. కమల్ హాసన్ రాజకీయంగా చాలా బిజీగా ఉన్నాడు.

అలాగే కొన్ని సినిమా పెండింగ్‌లో ఉన్నాయి. విక్రమ్, ఇండియన్ 2 సినిమాల షూటింగ్ పూర్తి చేయాలి. వీటికి తోడు ఎలాగు రాజకీయ పనులు. కాబట్టి, కమల్ హాసన్ తన చిత్రాలతో పాటు పొలిటికల్ కెరీర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ ని పక్కన పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ 5వ సీజన్ కు కమల్ హాసన్ హోస్ట్ గా ఉండకపోవచ్చు. స్టార్ హీరో శింబు హోస్టుగా వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.

Venkata Chari

Venkata Chari

Next Story