Vikram:'విక్రమ్' సినిమాపై దృష్టి పెట్టిన కమల్ హాసన్

Kamal Haasan to kickstart Vikram
x

కమల్ హాసన్ (ఫొటో ట్విట్టర్)

Highlights

ఇప్పటివరకు రాజకీయాల్లో బిజీగా ‎ఉన్న కమల్ హాసన్.. ప్రస్తుతం బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో బిజీగా మారేందుకు సిద్ధమయ్యారంట.

Vikram: ఇప్పటివరకు రాజకీయాల్లో బిజీగా ‎ఉన్న విశ్వనటుడు కమల్ హాసన్.. ప్రస్తుతం బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో బిజీగా మారేందుకు సిద్ధమయ్యారంట.

కమల్ హాసన్ తన తదుపరి ప్రాజెక్ట్ 'విక్రమ్' సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈమేరకు వీలైనంత త్వరగా ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలని మేకర్స్ ను కోరినట్లు తెలుస్తోంది. పరిస్థితి సాధారణ స్థితికి రాగానే కమల్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ ప్రారంభించేలోపు ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ ఇద్దరూ వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ ను ముగించాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి ఇద్దరు స్టార్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు... ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories