కామెడీ అనేది సీరియస్ బిజినెస్ అంటున్న కమల్ హాసన్

Kamal Hassan: మళ్లీ శభాష్ నాయుడు సినిమాని పట్టాలెక్కించనున్న కమల్ హాసన్

Jyothi
Updated on: 8 Jun 2022 1:18 PM IST
Kamal Haasan To Direct Sabash Naidu Movie Again
X

కామెడీ అనేది సీరియస్ బిజినెస్ అంటున్న కమల్ హాసన్

Kamal Hassan: సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న అద్భుతమైన నటుల లో కమల్ హాసన్ పేరు ముందే ఉంటుంది. ఎటువంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే టాలెంట్ కమల్ హాసన్ కి వెన్నతో పెట్టిన విద్య. 60 ఏళ్ల తన నట ప్రస్థానంలో లకు సంబంధించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేశారు కమల్ హాసన్. అయితే ఆయన చేసిన అన్ని జోన్లలో ఆయన ఫేవరెట్ కామెడీ అని చాలా సందర్భాల్లో చెప్పారు. కమల్ హాసన్ నటించిన చాలా కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా కూడా నిలిచాయి. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కమల్ హాసన్ కడుపుబ్బా నవ్వించగలరు.

అయితే "మన్మథబాణం" సినిమా తర్వాత కమల్ హాసన్ కామెడీ సినిమాలకి దూరంగా ఉంటూ కేవలం యాక్షన్ సినిమాల పైన దృష్టి పెట్టారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ "శభాష్ నాయుడు" అనే సినిమాని మొదలు పెట్టారు కానీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఆ సినిమా అటకెక్కింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళంలో ఇప్పటిదాకా చాలా కామెడీ సినిమాల్లో నటించాను అని చెప్పిన కమల్ హాసన్ ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండే సబ్జెక్ట్లు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికి కూడా ఒక కామెడీ సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కామెడీ అనేది సీరియస్ బిజినెస్ కాబట్టి ఎంత జాగ్రత్తగా చేయాలి అనేది కూడా ముఖ్యమని అన్నారు. అంతేకాకుండా శభాష్ నాయుడు రైట్స్ ఇంకా తన దగ్గరే ఉన్నాయని ఆ సినిమాని మళ్ళీ మొదలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిపారు కమల్.

Jyothi

Jyothi

Next Story