Kamal Haasan: తన ఆస్తుల చిట్టా చూపించిన కమల్ హాసన్

Kamal Haasan Shares his Assets with Government
x

తన ఆస్తులను ప్రభుత్వం ముందు ఉంచిన కమల్ హాసన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Kamal Haasan: ఆస్తుల వివరాలు పంచుకున్న కమల్ హాసన్

Kamal Haasan: తెలుగు తమిళ ఇండస్ట్రీలలో నటుడిగా లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్. తన విభిన్నమైన నటనతో, అద్భుతమైన సినిమాలతో ఇప్పటికే చాలామంది అభిమానుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కమల్ హాసన్. సినిమాల్లో నటుడిగా అందరి మన్ననలు పొందిన కమల్ హాసన్ ఈ మధ్యనే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. "మక్కల్ నీది మయ్యం" అనే పార్టీతో తమిళనాడులో ఒక రాజకీయ పార్టీని మొదలుపెట్టారు కమల్ హాసన్. స్వాతంత్ర ఎన్నికలలో కూడా పోటీ చేసిన కమల్ హాసన్ బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయిన సంగతి కూడా తెలిసిందే.

అయితే ఎన్నో సినిమాలు చేసిన కమల్ హాసన్ ఆస్తి ఇప్పుడు 176 కోట్ల పై చిలుకు అని సమాచారం. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన సమయంలో కమల్ హాసన్ తన ఆస్తుల జాబితాని ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో ఆయన ఆస్తుల విలువ 131.84 కోట్లు కాగా 45.09 కోట్ల వరకు చరాస్తుల ఉన్నాయి. భారతదేశంలో మాత్రమే కాక విదేశాల్లో కూడా కమల్ హాసన్ కు కోట్లు విలువ చేసే భవనాలు ఉన్నాయి. అంతేకాకుండా కమల్ హాసన్ తనకి యాభై కోట్ల అప్పు కూడా ఉందని గతంలో అఫిడవిట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories