లోకేష్ కోసం ఇంట్రెస్టింగ్ ప్రామిస్ ఇచ్చిన కమల్ హాసన్..!

*లోకేష్ నెక్స్ట్ సినిమా కూడా నాదే అంటున్న కమల్ హాసన్

Rama Rao
Updated on: 18 Jun 2022 3:37 PM IST
Kamal Haasan Says I am Ready to Next Film With Lokesh Kanagaraj
X

లోకేష్ నెక్స్ట్ సినిమా కూడా నాదే అంటున్న కమల్ హాసన్

Kamal Haasan: "ఖైదీ" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా కమల్ హాసన్ హీరోగా "విక్రమ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ మరియు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. కమల్ హాసన్ కు బోలెడు ప్రాఫిట్ లు తీసుకు వచ్చింది ఈ చిత్రం.

ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ కి ఫ్యాన్ అయిపోయారు కమల్ హాసన్. సినిమా విజయం తరువాత కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ కు ఒక ఖరీదైన కారుని గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు. "విజయ్ హీరోగా లోకేష్ చేస్తున్న నెక్స్ట్ సినిమా కూడా నాదే.

ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకొని లోకేష్ మళ్లీ నా సినిమాకి రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇక లోకేష్ నెక్స్ట్ సినిమాల విషయంలో నేను ఏ విధంగా వీలైతే ఆ విధంగా సహాయం చేయడానికి సిద్ధం గా ఉన్నాను" అని అన్నారు కమల్ హాసన్. ఇక ఖైదీ మరియు విక్రమ్ సినిమాలను కలిపి లోకేష్ కనగరాజ్ తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో "విక్రమ్ 2" సినిమాపై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rama Rao

Rama Rao

Next Story