"విక్రమ్" సినిమాతో తన మాట నిజమైంది అంటున్న కమల్ హాసన్

*"విక్రమ్" సినిమాతో తన మాట నిజమైంది అంటున్న కమల్ హాసన్

Rama Rao
Updated on: 16 Jun 2022 11:01 AM IST
Kamal Haasan Says His Word Came True With the Vikram Movie
X

"విక్రమ్" సినిమాతో తన మాట నిజమైంది అంటున్న కమల్ హాసన్

Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ దాదాపుగా నాలుగేళ్ల విరామం తరువాత తాజాగా "విక్రమ్" అనే సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక సినిమాని నిర్మించిన కమల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కోలీవుడ్ స్టార్ సూర్యకు తన ఖరీదైన రోలెక్స్ వాచ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు ఖరీదైన కారు, డైరెక్షన్ టీమ్ లో వారికి బైక్ లు అంటూ ప్రతీ ఒక్కరికి గిఫ్ట్ లు ఇచ్చారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్ల వసూళ్లని రాబట్టింది ఈ సినిమా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చింతలేని నాయకుడు మనకు కావాలి. గతంలో నేను రూ. 300 కోట్లు సంపాదిస్తానంటే నా మాట ఎవరూ నమ్మలేదు.

విక్రమ్ సినిమా వసూళ్లతో నా మాట ఇప్పడు నిజమైంది. ఇక నా అప్పులన్నీ తీర్చేస్తాను. నాకు నచ్చిన ఆహారాన్ని తింటాను. నా దగ్గర ఉన్న డబ్బుతో నా కుటుంబం మరియు నా సన్నిహితులకు చేతనైనంత సహాయం చేస్తాను, కానీ వేరే వాళ్ల డబ్బుని తీసుకుని పక్కవాళ్లకు సాయం చేసే అలవాటు నాకు లేదు. నేను ఒక మంచి వ్యక్తిగా వుండాలనుకుంటున్నాను" అని అన్నారు కమల్.

Rama Rao

Rama Rao

Next Story