Kamal Haasan: షూటింగ్ సెట్స్ లో నట విశ్వరూపం చూపించిన కమల్ హాసన్

Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత విలక్షణమైన నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Arun Chilukuri
Updated on: 20 Sept 2022 9:30 PM IST
Kamal Haasan Mesmerizes Everyone With His Performance On The Sets Of Indian 2
X

Kamal Haasan: షూటింగ్ సెట్స్ లో నట విశ్వరూపం చూపించిన కమల్ హాసన్

Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత విలక్షణమైన నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాలోని కమల్ హాసన్ నటనకు ఒక చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా తన అద్భుతమైన నటనతో ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి తన పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ కమల్ హాసన్ కరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లను అందుకున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్ని దశాబ్దాలు గడిచినా కమల్ హాసన్ నటనలో ఉన్న మ్యాజిక్ ఇప్పటికీ అభిమానులను థియేటర్లకు రప్పిస్తోంది.

ఈ మధ్యనే కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా దానికి ఉదాహరణ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో "భారతీయుడు 2" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 1994లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా "భారతీయుడి" కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ కూడా త్వరలో మొదలు కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ సెట్స్ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.

సినిమా షూటింగ్లో భాగంగా ఒక సన్నివేశంలో కమల్ హాసన్ 10 నిమిషాల నిడివి ఉండే ఒక భారీ డైలాగ్ చెప్పాల్సి ఉంది. ఏకంగా 14 భాషలలో ఆ డైలాగ్ ఉంటుంది. కానీ ప్రతి పదాన్ని పర్ఫెక్ట్ గా పలుకుతూ కమల్ హాసన్ భారీ డైలాగుని సింగిల్ టేక్ లో ఓకే చేసి చిత్ర బృందానికి షాక్ ఇచ్చారు. కమల్ హాసన్ పర్ఫామెన్స్ కి సెట్స్ లో ఉన్న క్రూ మెంబర్స్ అవ్వక్కయ్యారు. ఇక సినిమాతో పాటు ఆ డైలాగ్ పై కూడా ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story