Kamal Haasan KH234: మణిరత్నం మూవీ అంటే భయపడుతున్న కమల్ హాసన్

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నటన అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కమల్ హాసన్. నటనకు ఆయన నిలువెత్తు రూపం. కమల్ చేయలేని పాత్ర ఈ ప్రపంచంలో లేదంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే అభిమానులు కమల్ హాసన్ ను లోక నాయకుడు అని పిలుస్తారు. అయితే ఒక సినిమా కమల్ ను భయపెడుతోందట.

Dhatripriya
Updated on: 2 Jun 2023 3:45 PM IST
Kamal Haasan KH234: మణిరత్నం మూవీ అంటే భయపడుతున్న కమల్ హాసన్
X

Kamal Haasan KH234: మణిరత్నం మూవీ అంటే భయపడుతున్న కమల్ హాసన్

Kamal Haasan KH234: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నటన అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కమల్ హాసన్. నటనకు ఆయన నిలువెత్తు రూపం. కమల్ చేయలేని పాత్ర ఈ ప్రపంచంలో లేదంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే అభిమానులు కమల్ హాసన్ ను లోక నాయకుడు అని పిలుస్తారు. అయితే ఒక సినిమా కమల్ ను భయపెడుతోందట.

ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2లో నటిస్తున్నారు. 1996లో విడుదలైన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసేందుకు శంకర్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే, కమల్ నటించనున్న మరో మూవీ KH234. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకుడు.

మణిరత్నం, కమల్ హాసన్ కలయికలో గతంలో వచ్చిన నాయకుడు మూవీ ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే. దీంతో వెండితెరపై మరో నాయకుడు వచ్చేస్తుందంటూ కమల్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అనౌన్స్ మెంట్ వచ్చిందే ఆలస్యం సినిమాపై అటు లోక నాయకుడు ఫ్యాన్స్, ఇటు మణిరత్నం ఫాన్స్ భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. మరో అద్భుతం వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారు.

అభిమానులు పెట్టుకుంటున్న ఈ అంచనాలను చూస్తే కమల్ కలవరపడుతున్నాడట. KH234 పై అంచనాలు చూస్తే కంగారుగా ఉందని ఒత్తిడికి గురవుతున్నానని కమల్ తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఇన్నేళ్ల తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నడూ ఇలాంటి అనుభూతికి గురి కాలేదని ఇదే ఫస్ట్ టైమ్ అంటూ కమల్ చెప్పారట. నిజమే, కొన్ని కాంబినేషన్లు అంటే ప్రేక్షకులకు కొండంత అభిమానం ఉంటుంది. ఆ అభిమానం కొన్నిసార్లు మొదటికే మోసం తెస్తుంది.

నాయకుడు వంటి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ వచ్చిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్, మణిరత్నం కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షక లోకంలో అంచనాలు తారాస్థాయిలోనే ఉంటాయి. ఇది కాదనలేని వాస్తవం. సినిమా ఏమాత్రం అటు ఇటైనా విమర్శలు సైతం అదే స్థాయిలో ఉంటాయి. అందుకే కమల్ ఒత్తిడికి గురవుతున్నారు. కానీ, అటు కమల్ ఇటు మణిరత్నం..వీరిద్దరికి ఉన్న క్రేజ్ కారణంగా..సినిమా ఎలా ఉన్నా ఆదరించేందుకు ప్రేక్షకులు సిద్ధంగానే ఉంటారు.

ఇకపోతే KH234 షూటింగ్ మరో రెండు, మూడు నెలల్లో ప్రారంభం కానుంది. కమల్ హాసన్ కు జోడీగా త్రిష నటించనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తూంగవనం, మన్మథ అంబు తెలుగులో మన్మథ బాణం రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడవది రాబోతోంది. ఏదిఏమైనా, కమల్ ఎలాంటి ఒత్తిడి లేకుండా KH234 మూవీని చేసి హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story