రోలెక్స్ కి రోలెక్స్ వాచ్ ఇచ్చిన కమల్ హాసన్

Kamal Haasan Gives a Rolex Watch Gift To Surya
x

రోలెక్స్ కి రోలెక్స్ వాచ్ ఇచ్చిన కమల్ హాసన్

Highlights

Kamal Hassan: సూర్య కి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్

Kamal Hassan: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన "విక్రమ్" సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయి బాక్సాఫీసు వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఖైదీ ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాతో అభిమానులకు కన్నుల విందు చేశారు. ఖైదీ మరియు విక్రమ్ సినిమా కథలను కలిపి సౌత్లో మొట్టమొదటి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు లోకేష్ కనగరాజ్. అయితే విక్రమ్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆఖరి ఐదు నిమిషాలు మరొక ఎత్తు. విక్రమ్ సినిమా లోని మెయిన్ విలన్ అయిన రోలెక్స్ పాత్ర ఆఖరి 5 నిమిషాల్లోనే ఎంటర్ అవుతుంది.

ఆ పాత్ర పోషించింది మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. సూర్య ఇంట్రో సమయంలో థియేటర్లు దద్దరిల్లి పోయాయి అని కమల్ హాసన్ స్వయంగా చెప్పారు. రోలెక్స్ పాత్ర ఇంట్రడక్షన్ తో ఈ సినిమా సీక్వెల్ మరొక లెవెల్లో ఉండబోతోందని లోకేష్ కనగరాజ్ చెప్పకనే చెప్పారు. అయితే సినిమా హిట్ అవడానికి సూర్య కూడా ముఖ్య కారణం అని తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ సూర్య కి తన సొంత రోలెక్స్ వాచ్ ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories