"భారతీయుడు 2" ఇంకా శంకర్ చేతుల్లోనే ఉంది అంటున్న కమల్ హాసన్

*"భారతీయుడు 2" ఇంకా శంకర్ చేతుల్లోనే ఉంది అంటున్న కమల్ హాసన్

Rama Rao
Updated on: 1 Jun 2022 9:34 AM IST
Kamal Haasan Comments on Bharateeyudu 2 Movie | Tollywood
X

"భారతీయుడు 2" ఇంకా శంకర్ చేతుల్లోనే ఉంది అంటున్న కమల్ హాసన్ 

Kamal Haasan: 1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "భారతీయుడు" సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. అవినీతిపై శంకర్ తనదైన శైలిలో అద్భుతమైన సినిమాని తీశారు. అప్పట్లో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఆ సినిమా కి ఒక సీక్వెల్ ప్రకటించిన "భారతీయుడు 2" అనే టైటిల్ తో కమల్ హాసన్ మరియు కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు శంకర్.

కానీ అప్పటి నుంచి శంకర్ కి ఏదో ఒక విధంగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక ఆఖరికి నిర్మాతలకి మరియు శంకర్ కి మధ్య గొడవలు వచ్చి సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ పుకార్లపై కమల్ హాసన్ స్పందిస్తూ, "ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించడం లేదు. శంకర్ సినిమాని టేకప్ చేస్తారు.

అయితే ప్రస్తుతం శంకర్ వేరే ప్రాజెక్ట్ (రామ్ చరణ్ సినిమా)తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత నా సినిమా మొదలవుతుంది. నా నుంచి వెంట వెంటనే సినిమాలు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. నాకు కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని ఉంది. కానీ దర్శకత్వ బాధ్యత కూడా నేను నెత్తి మీద పెట్టుకుంటే అది కుదరదు. అందుకే ఆ బాధ్యతలు వేరే దర్శకులకి అప్పగిస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్.

Rama Rao

Rama Rao

Next Story