Kamal Haasan: "భారతీయుడు-2" పై క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్

Kamal Haasan Clarifies Relaease and Shooting Details of Bharateeyudu-2 Movie
x

కమల్ హాసన్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

Kamal Haasan: 1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ "భారతీయుడు" బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే ఆ సినిమా విడుదల...

Kamal Haasan: 1996లో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ "భారతీయుడు" బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే ఆ సినిమా విడుదల అయిన దాదాపు పాతికేళ్ళ తర్వాత తాజాగా కమల్ హాసన్ మరియు శంకర్ కలిసి "భారతీయుడు-2" సినిమా ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చింది. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ తరువాత బడ్జెట్ విషయంలో నిర్మాతలకు శంకర్ కి మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు శంకర్ మీద కేసు కూడా పెట్టారు. చాలాకాలంపాటు కోర్టులో నలిగిన ఈ కేసు నుండి శంకర్ ఈ మధ్యనే బయటపడ్డారు.

అయితే ఈ షూటింగ్ ఈ సినిమా గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ "సినిమాకి సంబంధించి 60 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. ప్రస్తుతానికి మేము ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాము. 'విక్రమ్' సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్ళి మొదలవుతుంది," అని క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. అంతేకాకుండా ఈ మధ్యనే ఫాహాధ్ ఫాసిల్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన "మాలిక్" సినిమాకి దర్శకత్వం వహించిన మహేష్ నారాయణ తదుపరి సినిమా కోసం కమల్ హాసన్ స్క్రిప్టు అందిస్తున్నారు. ఈ విషయం కమల్ హాసన్ స్వయంగా రివీల్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories