Kamal Haasan: వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కమల్ హాసన్

Kamal Haasan Busy with Serial Projects
x

వరుస ప్రోజెక్టులతో బిజీగా ఉన్న కమల్ హాసన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Kamal Haasan: బోలెడు బడా ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన కమల్ హాసన్

Kamal Haasan: ప్రస్తుతం కమల్ హాసన్ చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. అభిమానులు అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "విక్రమ్". ప్రస్తుతం కమల్ హాసన్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "విక్రమ్". త్వరలో ప్రేక్షులముందుకు రాబోతున్న ఈ సినిమాకి "ఖైదీ" మరియు "మాస్టర్" ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత కమల్ హాసన్ మహేష్ నారాయణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. "సి యు సూన్", "ఉయరే" ఫెమ్ మహేష్ నారాయణ ఇప్పటికే కమల్ హాసన్ హీరోగా "విశ్వరూపం-2" సినిమా చేశారు కానీ ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. మహేష్ నారాయణన్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత కమల్ హాసన్ "కబాలి", "కాలా" ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కమల్ హాసన్ వెట్రిమారన్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories