Prabhas Project K: ప్రభాస్ తో కమల్ హాసన్ ఢీ..? అసలు నిజం ఏంటంటే..?

ప్రస్తుతం ప్రభాస్ సలార్, రాజాడీలక్స్ సహా ప్రాజెక్ట్ k చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ k పై ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి.

Dhatripriya
Published on: 31 May 2023 3:44 PM IST
Prabhas Project K: ప్రభాస్ తో కమల్ హాసన్ ఢీ..? అసలు నిజం ఏంటంటే..?
X

Prabhas Project K: ప్రభాస్ తో కమల్ హాసన్ ఢీ..?? అసలు నిజం ఏంటంటే..

Prabhas Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ నేతృత్వంలో భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, రాజాడీలక్స్ సహా ప్రాజెక్ట్ k చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ k పై ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంటే మరో ముఖ్యపాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.

రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ k చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ k కు సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారని ఇందుకోసం కమల్ కు రూ.150 కోట్లు రెమ్యునరేషన్ రూపంలో చెల్లిస్తున్నారని ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్ట్ k లో కమల్ భాగస్వామ్యం కావడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. మరి ఇలాంటి స్టేజ్ లో కమల్ హాసన్ ను ఎందుకు విలన్ గా తీసుకుంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తుదిదశకు చేరుకున్న తరుణంలో ప్రాజెక్ట్ k లో కమల్ చేరిక అంటే నమ్మశక్యంగా లేదంటున్నారు. కమల్ తో ప్రాజెక్ట్ k మేకర్స్ సంప్రదింపులు జరిపిన మాట వాస్తమే అయినా..విలన్ పాత్రకు మాత్రం కాదని చెబుతున్నారు. కమల్ హాసన్ ను అతిథి పాత్రకు లేదంటే వాయిస్ ఓవర్ కు సంప్రదించి ఉంటారని అంచనా వేస్తున్నారు. మొత్తానికి, కమల్ చేరికపై ప్రాజెక్ట్ కే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే..నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. ఇక సినిమాని మేకర్స్ 2024 జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story