మరొక పెద్ద ఆఫర్ దక్కించుకున్న 'హలో' బ్యూటీ

మరొక పెద్ద ఆఫర్ దక్కించుకున్న హలో బ్యూటీ
x
Highlights

మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన రెండవ సినిమా 'హలో' తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. అయితే మొదటి సినిమాతోనే...

మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన రెండవ సినిమా 'హలో' తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. అయితే మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న ఈ భామ ఈ మధ్యనే మళ్లీ 'చిత్రాలహరి' సినిమాతో వెండితెరపై కనిపించింది. సాయిధరమ్ తేజ్ హీరోగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ భామకు కూడా తెలుగులో మంచి పేరు దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ కు మరొక పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

నితిన్ హీరోగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' అనే ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గీత గోవిందం బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ కు దక్కింది. రెండవ హీరోయిన్ అయినప్పటికీ ఆమె పాత్రకు బాగా ప్రాధాన్యత ఉంటుందని అందుకే వెంటనే ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఎండింగ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories