"ఆర్ఆర్ఆర్" మరియు "అఖండ" సెంటిమెంట్ వాడనున్న కళ్యాణ్ రామ్

Kalyan Ram Will use RRR and Akhanda Sentiment
x

"ఆర్ఆర్ఆర్" మరియు "అఖండ" సెంటిమెంట్ వాడనున్న కళ్యాణ్ రామ్

Highlights

Nandamuri Kalyan Ram: గత కొంతకాలంగా ఒక మంచి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్..

Nandamuri Kalyan Ram: గత కొంతకాలంగా ఒక మంచి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు "బింబిసార" అనే ఒక సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. హారర్, థ్రిల్లర్ మరియు యాక్షన్ జోనర్లలో ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. తాజాగా "బింబిసార" సినిమా లో "ఆర్ఆర్ఆర్" మరియు "అఖండ" సెంటిమెంటుని ఫాలో అవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో జబేద అనే ఒక పాత్రలో కనిపించనున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో చిన్న పాప సెంటిమెంట్ చాలా బాగుంటుందని చెప్పారు. "ఆర్ ఆర్ ఆర్" మరియు "అఖండ" సినిమాలలో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉంటుంది. అది బాగానే వర్క్ అవుట్ అయ్యి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు గా మారాయి. చూస్తూ ఉంటే "బింబిసార" సినిమాలో కూడా ఇప్పుడు అదే సెంటిమెంట్ ఉండబోతోంది అని అదే సినిమాకి హైలైట్ కాబోతోంది వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ చిన్న పాప సెంటిమెంట్ కళ్యాణ్ రామ్ కు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. కేథరిన్ తెరెసా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్తా మీనన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories