కేవలం రాజకీయ లాభం కోసమే పేరు మార్చారు.. కళ్యాణ్ రామ్ సంచలన ట్వీట్..

Kalyan Ram Respond On the Change of Name to NTR Health University
x

కేవలం రాజకీయ లాభం కోసమే పేరు మార్చారు.. కళ్యాణ్ రామ్ సంచలన ట్వీట్..

Highlights

Kalyan Ram: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలకు వేదికైంది.

Kalyan Ram: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్‌గా మార్చుతూ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలకు వేదికైంది. ఒక్క టీడీపీ మాత్రమే కాదు ఇతర పార్టీలు, నేతలు సైతం జగన్ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించారు. తాజాగా ఈ అంశంపై నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. కేవలం రాజకీయ లాభం కోసం పేరు మార్చడం తప్పు అని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

"1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది మరియు లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు" అంటూ రాసుకొచ్చాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories