బాబాయ్ సినిమాలో మరోసారి అబ్బాయి?

బాబాయ్ సినిమాలో మరోసారి అబ్బాయి?
x
Highlights

ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. పోలిస్ ఆఫీసర్ పాత్రలో ఇంటర్వెల్ ముందు కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడని తెలుస్తోంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. పోలిస్ ఆఫీసర్ పాత్రలో ఇంటర్వెల్ ముందు కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. గతంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడి తాజాగా మొదలైంది. అటు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ ని పరీశిలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories