Kalyan Ram: "బింబిసార" ముఖ్య కథాంశం అదేనా?

Kalyan Ram Bimbisara Telugu Movie Story
x

Kalyan Ram: "బింబిసార" ముఖ్య కథాంశం అదేనా?

Highlights

Kalyan Ram - Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "బింబిసార".

Kalyan Ram - Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "బింబిసార". 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో విడుదల కాబోతున్న ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించారు. ట్యాగ్ లైన్ చూస్తుంటేనే ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్టుతో పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే ఆధునిక చారిత్రక యుగాలకు సంబంధించిన కథలను కూడా ఈ సినిమాలో చెప్పబోతున్నారు. ఇక ఈ సినిమా రెండు వేరువేరు టైమ్ జోన్ లలో జరగబోతోందని సమాచారం. ఈ సినిమా ఒక మ్యూజికల్ అద్దం చుట్టూ తిరగబోతోంది అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ మాయా అద్దం రహస్యం ఏంటి అందులో ఎం కనిపిస్తుంది అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న లుక్స్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు క్రూరమైన బార్బెరియన్ కింగ్ గా కనిపించనున్న కళ్యాణ్ రామ్ మరోవైపు మోడర్న్ యువకుడిగా కూడా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నారు. తన కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కేథరిన్ తెరెసా మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. చోటా కె నాయుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories