టాలీవుడ్ హీరోయిన్ పై ఫైర్ అయిన కల్పిక

* తాజాగా ఒక వీడియోలో మాట్లాడుతూ కల్పిక ధన్య బాలకృష్ణ మీద మండిపడింది.

R Tripura Malini
Published on: 16 Dec 2022 8:39 AM IST
Kalpika Ganesh Made Shocking Comments On Dhanya Balakrishnan
X

టాలీవుడ్ హీరోయిన్ పై ఫైర్ అయిన కల్పిక

Kalpika Ganesh: జూనియర్ ఆర్టిస్ట్ కల్పికా గణేష్ పేరు ఈమధ్య ఆ బాగానే వినిపిస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిట్ వంటి సినిమాలలో కనిపించినా కల్పిక ఈ మధ్యనే సమంత హీరోయిన్గా నటించిన యశోద సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించింది. ఇక తాజాగా ఇప్పుడు కల్పిక తన కి ఒక యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసి సినీ ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటకు చెబుతూ వస్తోంది. తాజాగా ఒక వీడియోలో మాట్లాడుతూ కల్పిక ధన్య బాలకృష్ణ మీద మండిపడింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేను శైలజ, అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి వంటి సినిమాలతో ధన్య కూడా నటిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా ఇప్పుడు ధన్య బాలకృష్ణ గురించి మాట్లాడుతూ కల్పిక కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ధన్య ఒక తమిళ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, బాలాజీ మోహన్ ధన్య కోసం తన మొదటి భార్యకి విడాకులు కూడా ఇచ్చేశాడు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈమధ్య తను సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని దానికి కారణం తను ఏమైనా ఇబ్బందుల్లో ఉందేమోనని చెప్పుకొచ్చింది కల్పిక.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రియాక్ట్ అవుతూ ధన్య బాలకృష్ణ ఒక కోలీవుడ్ స్టార్ హీరోతో చేతులు కలిపి ఈ వీడియోని బ్లాక్ చేయించిందని చెప్పింది కల్పిక. "ధన్య నువ్వు నన్ను వివాదాల్లోకి తీసుకొస్తున్నావు. కావాలంటే కోర్టుకెళ్ళి సెటిల్ చేసుకుందాం. నేను నీ సీక్రెట్లు బయటపెట్టినప్పుడు నన్ను బ్లాక్ చేసావు. మళ్ళీ ఇప్పుడు సడన్ గా అన్బ్లాక్ చేసి నిన్న రాత్రి ఫోన్లు చేసావు. వీడియోని యూట్యూబ్ లో నుంచి తీసేసి నువ్వు నీ పవర్ చూపించడానికి ప్రయత్నించావు. నేను నా పవర్ చూపించాలనుకుంటే నువ్వు మసైపోతావ్," అంటూ ఒక రేంజిలో ధన్య పై ఫైర్ అయ్యింది కల్పిక.

R Tripura Malini

R Tripura Malini

Next Story