అదిరిపోయే టీజర్ తో అలరిస్తున్న 'కల్కి'

అదిరిపోయే టీజర్ తో అలరిస్తున్న కల్కి
x
Highlights

ఈ మధ్యనే 'పిఎస్వి గరుడవేగ' సినిమా తో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి...

ఈ మధ్యనే 'పిఎస్వి గరుడవేగ' సినిమా తో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'కల్కి' అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఆ వీడియోని చూస్తే ఈ చిత్రం 1985 బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని అర్థమవుతుంది. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో కూడా ఈ టీజర్ చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఒక మారుమూల గ్రామం అందులో ఎవరికీ అంతుచిక్కని మరణాలు, ఒక పవర్ ఫుల్ విలన్ ముఠా, భయాందోళనలలో జనం. ఇవే 'కల్కి' టీజర్ ముఖ్యాంశాలు.

టీజర్ ఆఖరిలో ఆ ఊరిని కాపాడే పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ ఎంట్రీ ఇస్తారు. టీజర్ చూస్తే ఈ సినిమా మొత్తం ఉత్కంఠ భరితంగా నడుస్తుందని తెలుస్తోంది. చాలా కొత్తగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండే కథ అని చెప్పుకోవచ్చు. 'అ' సినిమాలో తన అరుదైన మేకింగ్ స్టైల్ తో ప్రేక్షకులను మెప్పించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా మెప్పిస్తాడు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. జయప్రకాశ్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రానా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. దాశరథి శివేంద్ర ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories