Prabhas: కల్కి మరో ట్రైలర్‌ సిద్ధమవుతోంది.. మునుపెన్నడూ చూడని విధంగా..!

Kalki Makers Planning to Release 2nd Trailer From Movie
x

Prabhas: కల్కి మరో ట్రైలర్‌ సిద్ధమవుతోంది.. మునుపెన్నడూ చూడని విధంగా..!

Highlights

Prabhas: కల్కి 2898 ఏడీ.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Prabhas: కల్కి 2898 ఏడీ.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా విడులవుతుందా, ఎప్పుడెప్పుడు విజువల్ ఫీస్ట్‌ను తిలకిద్దామా అని ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, కల్కి ట్రైలర్‌ ఒక్కసారిగా పాజిటివ్‌ బజ్‌ను తీసుకొచ్చింది. ట్రైలర్‌లో సినిమా కాన్సెప్ట్‌ను చెప్పిన నాగ అశ్విన్‌, చిత్రంపై క్యూరియాసిటినీ పెంచేశాడు. ఇక భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదన్న స్థాయిలో విజువల్స్‌, గ్రాఫిక్స్‌ ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మేకర్స్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్‌ చెప్పినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే మరో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈసారి మరింత ఎక్కువ నిడివి ఉన్న ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్‌ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 2 నిమిషాల 30 సెకండ్లు ఉన్న ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. మొదటి ట్రైలర్‌ను మించి రెండో ట్రైలర్‌ ఉండనుందని సమాచారం. ఇంత వరకు తెలుగు తెరపై ఎన్నడూ చూడని విజువల్స్‌తో ఈ ట్రైలర్‌ ఉండబోతోందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం మొదట్లో ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తుండగా. దీపికా పదుకునే, దిశా పఠాని, అమితాబ్‌తో పాటు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీరితో పాటు మృణాల్ ఠాకూర్, శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి స్టార్‌లు ఇందులో నటిస్తున్నారు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories