Kajal: మీట్‌ క్యూట్‌ లో కాజల్?

Kajal: నాని నిర్మాణంలో రూపొందుతున్న మీట్ క్యూట్ సినిమాలో కాజల్ ఓ పాత్రకు ఓకె చెప్పినట్లు సమాచారం.

Kranthi
Updated on: 19 Jun 2021 9:18 AM IST
Kajal in Talks For Meet Cute
X

Kajal Aggarwal

Read more at: https://english.mathrubhumi.com/movies-music/movie-news/kajal-aggarwal-turns-34-see-who-wished-her-on-birthday--1.3885581

Kajal: మరో ప్రయోగాత్మక చిత్రంలో కాజల్ నటించబోతుంది. హీరో నాని నిర్మాణంలో ఆయన సోదరి దీప్తి దర్శకత్వంలో రూపొందుతున్న మీట్ క్యూట్ సినిమాలో కాజల్ ఓ పాత్రకు ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో నటుడు సత్యరాజ్‌ ఓ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఐదుగురు కథానాయికలు కీలక పాత్రల్లో నటించనున్నారు. వారెవరన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం చిత్రసీమ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఓ పాత్ర కోసం నటి కాజల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు చందమామ అంగీకరించిందని వార్తలొస్తున్నాయి.

ఇక ఈ సినిమాలోని మిగతా పాత్రల కోసం నివేదా థామస్, రుహానీ శర్మ, అదా శర్మ తదితరుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాజల్‌ గతంలో నాని నిర్మాణంలో 'అ!' చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అది ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చిరంజీవికి జోడీగా 'ఆచార్య' సినిమాలో నటిస్తోంది.

Kranthi

Kranthi

Next Story