Kajal Aggarwal: ఆ కల నేటికి నెరవేరింది: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మోసగాళ్లు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

Venkata Chari
Published on: 17 March 2021 8:09 PM IST
Kajal Aggarwal to romance Nagarjuna Akkineni
X

కాజల్ అగర్వాల్, అక్కినేని నాగర్జున (ఫొటో హన్స్ ఇండియా)

Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మోసగాళ్లు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు కి అక్కగా నటిస్తుంది. ఈమూవీ మార్చి 19న రిలీజ్ కానుంది.

కాగా, తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చింది మగధీర బ్యూటీ. అక్కినేని నాగర్జున చిత్రంలో భాగం కానున్నట్లు వెల్లడించింది. కాజల్ అగర్వాల్ చాలా కాలంగా హీరో నాగార్జునతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు అప్పుడప్పుడు చెబుతూనే ఉంటుంది. చివరికి ఆ అవకాశం ప్రవీణ్ సత్తారు సినిమా ద్వారా నెరవేరబోతోందని కాజల్ వెల్లడించింది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను మార్చి 31 వరకు పట్టాలెక్కించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం షూటింగ్ ను గోవాలో మొదలుపెట్టనున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఏడాది చివరికి విడుదల చేయాలని ప్రవీణ్ సత్తారు యోచిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story