Kajal Aggarwal: స్పెషల్‌ ఫొటో షేర్‌ చేసిన కాజల్‌ భర్త.. వైరల్‌ అవతోన్న 'కిస్‌' ఫొటో..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్‌ సైతం ఇదే ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోతో పాటు.. 'హ్యాపీ యానివర్సరీ టు మై లవ్‌. సమయం ఎలా గడిచిపోయిందో అర్థమవ్వడం లేదు. నీతో పాటు మరిన్ని అందమైన క్షణాలను గడపడం కోసం ఎదురు చూస్తున్నాను. అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను రాసుకొచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 Oct 2024 8:35 PM IST
Kajal Aggarwal
X

Kajal Aggarwal

Kajal Aggarwal: 2007లో వచ్చిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార కాజల్‌ అగర్వాల్‌. ఆ తర్వాత వచ్చిన 'చందమామ' సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అత్యంత తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిది. మగధీర మూవీతో ఒక్కసారిగా బడా హీరోయిన్‌ల జాబితాలో చేరిందీ బ్యూటీ. తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోల సరస నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది.

కాగా కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే ముంబయికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌమత్‌ కిచ్లును వివాహం చేసుకుంది. 2020 అక్టోబర్‌ 30వ తేదీన వివాహ మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఇదిలా ఉంటే బుధవారంతో వీరిద్దరి వివాహం జరిగి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే కిచ్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. భార్యకు ముద్దు పెడుతోన్న పోస్ట్‌ను షేర్‌ చేసిన కిచ్లు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జోడించాడు.

కాజల్ అగర్వాల్‌ సైతం ఇదే ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోతో పాటు.. 'హ్యాపీ యానివర్సరీ టు మై లవ్‌. సమయం ఎలా గడిచిపోయిందో అర్థమవ్వడం లేదు. నీతో పాటు మరిన్ని అందమైన క్షణాలను గడపడం కోసం ఎదురు చూస్తున్నాను. అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్యూట్‌ కపుల్స్‌కు నెటిజన్లు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక కాజల్ సినీ కెరీర్‌ విషయానికొస్తే ఈ బ్యూటీ చివరిగా ఇడియన్‌ 2 సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో తెరకెక్కుతోన్న కన్నప్ప ఒకటి కాగా మిగితావి హిందీలో ఉన్నాయి. ఇక ఇండియన్‌ 3 మూవీలో కూడా కాజల్‌ నటిస్తోంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story