Kajal Aggarwal: అడ్డంగా బుక్కయిన కాజ‌ల్.. నెట్టింట ట్రోల్స్

Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఏరికొరి ఓ కొత్త స‌మ‌స్య‌ను కొనితెచ్చుకుంది.

Samba Siva Rao
Updated on: 20 May 2021 3:03 PM IST
Kajal Aggarwal  Late Reply to Anushka Tweet
X

Anushka Shetty, Kajal Aggarwal, 

Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఏరికొరి ఓ కొత్త స‌మ‌స్య‌ను కొనితెచ్చుకుంది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెపై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ మొద‌లు పెట్టారు. దీనికి కార‌ణం ఆమె ఏడు నెలల త‌ర్వాత మరో టాప్ హీరోయిన్ అనుష్క ట్వీట్ పై స్పందించడమే. అస‌లు ఏం జ‌రిగిందంటే.. కాజ‌ల్ అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఆమె త‌న‌కు సంబంధించిన అప్ డేట్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటుంది. అంతేకాదు ఎవ‌రైనా సెల‌బ్రిటీలు కాజ‌ల్ పోస్టుల‌కు కామెంట్ చేసిన వెంట‌నే స్పందిస్తుంది. కొన్ని నిమిషాలు లేదంటే గంటల వ్యవధిలో సమాధానం ఇస్తుంది.

కాజల్ సోషల్ మీడియాలో అనుష్క చేసిన ట్వీట్ కు స్పందించేందుకు మాత్రం ఏకంగా 7 నెలలకు పైగా సమయంను తీసుకుంది. ఇన్నాళ్ల తర్వాత స్పందించడంతో కాజల్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకి ఆ ట్వీట్ ఏంటంటే.. ఏడు నెలల క్రితం కాజల్ పెళ్లి పీఠలు ఎక్కింది. ఆ సమయంలో ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రెటీలందరికి కూడా కాజల్ సమాధానం ఇచ్చింది. కాని అనుష్క చెప్పిన పెళ్లి శుభాకాంక్షలకు మాత్రం కాజల్ స్పందించలేదు. బుధ‌వారం అనుష్క ట్వీట్ పై స్పందించింది.

ఇక దాంతో స్వీటీ అభిమానులకు , నెటిజ‌న్లకు, ఆగ్ర‌హం తెప్పించింది. వారి ట్రోల్స్ కు అడ్డంగా బుక్కయినట్లుగా ఉంది. కరోనా పూర్తిగా పోయాక ట్వీట్ కు స్పందించి ఉంటే బాగుండేదని కొందరు.. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అనుష్క ట్వీట్ కు కాజల్ స్పందించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాజల్ ఆలస్యంపై నెట్టింట రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.

కాగా.. జేజేమ్మ ట్విట్టర్ లో అడుగు పెట్టింది కూడా అదే స‌మ‌యంలోనే... దానికి తోడు అనుష్క ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయ్యి లేదు. దాంతో అనుష్క ఫ్యాన్ పేజీ అనుకుని కాజల్ ఆ ట్వీట్ ను పట్టించుకున్నట్లుగా లేదు. అనుష్క ఈమద్య కాలంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె అకౌంట్ అధికారికం అని వెళ్లడయ్యింది. దాంతో కాజల్ ఇప్పుడు ఆమె ట్వీట్ కు సంబంధించింది. పెళ్లి శుభాకాంక్షలు చెప్పిన అనుష్కకు లవ్ ఈమోజీలు పెట్టి కృతజ్ఞతలు చెప్పింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story