Kajal Aggarwal: భర్త కోసం బ్రేక్ తీసుకుంటా అంటున్న కాజల్

Kajal Aggarwal: లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.

admin1
Published on: 7 Aug 2021 5:40 PM IST
Kajal Aggarwal Needs is a Vacation With her Husband Gautam Kitchlu
X

Kajal Aggarwal: భర్త కోసం బ్రేక్ తీసుకుంటా అంటున్న కాజల్

Kajal Aggarwal: లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది, పెళ్లి కూడా అయిపోయింది, అయినా సరే క్రేజ్ తగ్గని హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ పేరు ముందే ఉంటుంది. సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన భర్త కోసం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలని ప్లాన్ చేస్తోందట. గతేడాది కాజల్ అగర్వాల్ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లికి కేవలం కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకున్న కాజల్ ఆ వెంటనే "ఆచార్య" షూటింగ్లో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత హనీమూన్ కెల్లోచిన కాజల్ అగర్వాల్ మళ్లీ వెంటనే సినిమాలు, వెబ్ సిరీస్ షూటింగ్స్ అంటూ బిజీ అయిపోయిందట.

ఈ నేపథ్యంలో కాజల్ తన వ్యక్తిగత జీవితానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందుకు బాధపడుతోందట. అందుకే తన భర్త గౌతమ్ కోసం షూటింగ్స్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలని అనుకుంటోంది. ఈ మధ్యనే "హే సినామిక", "కరుంగాపియమ్ ఘోస్టీ" వంటి తమిళ సినిమాల షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్ హిందీ సినిమా "ఉమ" షూటింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా "ఆచార్య" షూటింగ్తో బిజీగా ఉన్న ఈమె త్వరలో ఈ షూటింగ్ నీ కూడా పూర్తి చేసుకొని తన భర్త కిచ్లు తో ఒక పెద్ద హాలిడే ట్రిప్కు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక కాజల్ అగర్వాల్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత నాగార్జున హీరోగా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ లో బిజీ అవ్వనుంది.

admin1

admin1

Next Story