Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఆ సినిమాతోనే.. క్లారిటీ ఇచ్చిన..

Kajal Aggarwal: ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే ప్రెగ్నెన్సీ వల్ల సినిమాలకి దూరమైంది.

Arun Chilukuri
Updated on: 5 Aug 2022 5:00 PM IST
Kajal Aggarwal Making her Reentry in Tollywood
X

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ రీఎంట్రీ ఆ సినిమాతోనే.. క్లారిటీ ఇచ్చిన..

Kajal Aggarwal: ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే ప్రెగ్నెన్సీ వల్ల సినిమాలకి దూరమైంది. తాజాగా ఒక బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ల కొరత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ కి బాగానే ఆఫర్లు వచ్చి పడేలా ఉన్నాయి.

ఇక ఎలాగో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించాల్సిన భారతీయుడు 2 సినిమా షూటింగ్ ఇంకా పట్టాలెక్కలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందట. కాజల్ అగర్వాల్ సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించాల్సింది.

కానీ కాజల్ గర్భవతి కావడంతో ఆమె పాత్రని తొలగించేసారు దర్శక నిర్మాతలు. "భారతీయుడు 2" విషయంలో కూడా ఈమెను రీప్లేస్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె పాత్రను తానే పోషించనున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది కాజల్. ఇక ఈ సినిమా మంచి హిట్ అయితే కాజల్ అగర్వాల్ కి మరిన్ని ఆఫర్లు వచ్చి పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story