Kajal Aggarwal: "చంద్రముఖి 2" తో అందరి దృష్టిని ఆకర్షించనున్న కాజల్

Kajal Aggarwal: "చంద్రముఖి 2" తో అందరి దృష్టిని ఆకర్షించనున్న కాజల్

Rama Rao
Published on: 15 Oct 2022 11:22 AM IST
Kajal Aggarwal is playing a role in Raghava Lawrences Horror Film Chandramukhi 2
X

Kajal Aggarwal: "చంద్రముఖి 2" తో అందరి దృష్టిని ఆకర్షించనున్న కాజల్

Kajal Aggarwal: తమిళ్లో కూడా మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్లలో రాఘవ లారెన్స్ కూడా ఒకరు. కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలుపెట్టి డైరెక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న రాఘవ లారెన్స్ మరోవైపు నటుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా "చంద్రముఖి" సినిమాకి కూడా లారెన్స్ దర్శకత్వం వహించాల్సింది కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సీక్వెల్ గా తారకక్కనున్న "చంద్రముఖి 2" కోసం రాఘవ లారెన్స్ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్ తాజాగా ఇప్పుడు మళ్లీ తన కరియర్ ను పెడుతూ, ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించబోతోంది. అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మాత్రమే కాకుండా మరొక ఆరుగురు నటిమణులు కూడా ఉండబోతున్నారని ఇక తన పాత్రకి బాగా ప్రాధాన్యత ఉండటంతో కంబాక్ లాగా ఈ సినిమా చాలా బాగుంటుందని కాజల్ అగర్వాల్ ఈ సినిమాకి వెంటనే ఓకే చెప్పేసిందట.

Rama Rao

Rama Rao

Next Story