Kajal Agarwal: కాజల్ అగర్వాల్‌కి షాకింగ్ రెమ్యునరేషన్!

Kajal Agarwal: ఓ పక్క లాక్డౌన్, మరోవైపు థియేటర్ల మూసివేతతతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది.

Venkata Chari
Published on: 20 May 2021 6:37 PM IST
Kajal Aggarwal Get Shocking Remuneration for Her Next Web Series in Aha | Telugu Heroins Latest Updates
X

కాజల్ అగర్వాల్‌ (ఫొటో ట్విట్టర్)

Kajal Agarwal: ఓ పక్క లాక్డౌన్, మరోవైపు థియేటర్ల మూసివేతతతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. వీక్షకులు ఇంటి వద్దే ఉండడంతో డిజిటల్ కంటెంట్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. దీంతో వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.

దీంతో స్టార్ హీరో, హీరోయిన్లు వెబ్ సిరీస్‌లలో నటించేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నా, సమంతా ఓటీటీల్లో సందడి చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 'లెవన్త్ అవర్' తో తొలిసారిగా ఓటీటీలో కనిపించింది. అలాగే హాట్‌ స్టార్‌లో 'నవంబర్ స్టోరి' లోనూ సందడి చేస్తుంది. ఇక సమంతా తొలి వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' జూన్ లో హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఇక కాజల్ అగర్వాల్ 'లైవ్ టెలికాస్ట్' తో హాట్ స్టార్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.

తాజా నివేదికల ప్రకారం, 'లెవన్త్ అవర్' వెబ్ సిరీస్ కోసం తమన్నాకు రెండు కోట్ల భారీ పారితోషికం లభిస్తుందనే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పిందంట. ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుందంట. ఈ ప్రాజెక్ట్ కోసం కాజల్ రూ. 2 కోట్లకు పైగా వేతనం అందుకోబోతోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను స్టార్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story