Kajal Aggarwal: "అమ్మతనం" అద్భుతమైనది అంటున్న స్టార్ హీరోయిన్

* ప్రెగ్నెన్సీ పుకార్ల పై స్పందించిన కాజల్ అగర్వాల్

admin1
Updated on: 10 Nov 2021 4:45 PM IST
Kajal Aggarwal Reacts to her Pregnancy Rumours - Tollywood News
X

కాజల్ అగర్వాల్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Kajal Aggarwal Pregnancy News: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతేడాది లాక్డౌన్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాజల్ నాగార్జున హీరోగా నటిస్తున్న "గోస్ట్" సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

అయితే దీనికి కారణం కాజల్ త్వరలోనే తల్లి కాబోతోందని అందువల్లే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపించాయి. ఇక ఒక ప్రెగ్నెన్సీ కిట్ బ్రాండ్ కి కాజల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. చాలా కాలం పాటు ఈ పుకార్లపై మౌనం వహించిన కాజల్ అగర్వాల్ ఈమధ్యనే మౌనం వీడారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ విషయమై ఇప్పుడు మాట్లాడాలని లేదని సరైన సమయం చూసి తనే మాట్లాడతానని అన్నారు. ఇక ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ ఆమె తన చెల్లెలు నిషా అగర్వాల్ ప్రెగ్నెన్సీ సమయంలో తాను తన పక్కనే ఉన్నానని అమ్మతనం ఒక అద్భుతమైన అనుభూతి అని అన్నారు.

అంతేకాకుండా చెల్లెలి పిల్లలు ఇషాన్, కబీర్ మరియు తమ పెంపుడు కుక్క మియా తో ఉన్నప్పుడు తనకి ఒక అమ్మ ఫీలింగ్ కలుగుతుంది అని అన్నారు కాజల్. ఇక సినిమాల పరంగా కాజల్ అగర్వాల్ "భారతీయుడు 2", "ప్యారిస్ ప్యారిస్", "హే సినామికా" మరియు "కరుంగాపియం" సినిమాలతో బిజీగా ఉంది.

admin1

admin1

Next Story