Kajal Aggarwal: అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న కాజల్ అగర్వాల్

* ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కాజల్ అగర్వాల్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులకు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి

admin1
Updated on: 23 Sept 2021 6:30 PM IST
Kajal Aggarwal Fans Confused about She was Dropping out of The Ghost movie
X

కాజల్ అగర్వాల్ (ఫోటో - ది హన్స్ ఇండియా )

Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతేడాది తన ప్రియుడు అయిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా కాజల్ గర్భవతి అంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కానీ కాజల్ మరియు గౌతమ్ మాత్రం ఈ పుకార్లపై మౌనం వహిస్తుండడంతో ఈ పుకార్లు మరింత జోరందుకున్నాయి. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కాజల్ అగర్వాల్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు మాత్రం అభిమానులకు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఒకవైపు కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అంటూ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరో వైపు కాజల్ అగర్వాల్ మాత్రం తన సోషల్ మీడియా ప్లాట్ఫాంలో తన హాట్ పిక్చర్ లను షేర్ చేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అయితే అభిమానులు మాత్రం కాజల్ అగర్వాల్ నిజంగానే ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాజల్ నాగార్జున హీరోగా నటిస్తున్న "ది ఘోస్ట్" సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ తాను ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో దర్శకనిర్మాతలు మరొక హీరోయిన్ కోసం వెతకటం మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం కాజల్ ప్రెగ్నెన్సీ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

admin1

admin1

Next Story