Kajal Aggarwal: మరొక సినిమా నుంచి తప్పుకున్న కాజల్. కారణం ఇదేనా?

Kajal Aggarwal:

admin1
Updated on: 10 Nov 2021 8:30 PM IST
Kajal Aggarwal Dropped out From Nagarjuna
X

కాజల్ అగర్వాల్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గతేడాది గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె త్వరలో తల్లి కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కింగ్ నాగార్జున తదుపరి సినిమా అయిన "ఘోస్ట్" లో కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. కానీ కాజల్ తనంతట తానే ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీనికి కారణం కాజల్ గర్భం దాల్చడం అని సమాచారం.

ఇప్పుడు తాజాగా కాజల్ చేసిన మరొక పని ఈ పుకార్లను మరింత ఊపందుకుందుకునేలా చేసింది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న "భారతీయుడు 2" సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె "భారతీయుడు 2" సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కచ్చితంగా కాజల్ తల్లి కాబోతున్నట్లు వార్తలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతున్న కాజల్ ప్రెగ్నెన్సీ పుకార్లపై తనకి ఇప్పుడే మాట్లాడాలని లేదని సరైన సమయం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పుకొచ్చింది.

admin1

admin1

Next Story