రేపే టాలీవుడ్ మిత్రవింద పెళ్లి..మెహిందీ తో మెరిసిన కాజల్!

టాలీవుడ్ మిత్రవిందకు రేపే పెళ్లి కానుంది. ఈ సందర్భంగా కాజల్ చేతులకు మెహిందీ పెట్టేసుకుంది. ఆ ఫొటోలను ఇంటర్నేట్‌లో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆ మెహిందీ ఎర్రబడే లోపే ఆ ఫొటోలు ఫుల్ వైరల్‌గా మారాయి.

Krishna
Updated on: 29 Oct 2020 7:43 PM IST
రేపే టాలీవుడ్ మిత్రవింద పెళ్లి..మెహిందీ తో  మెరిసిన కాజల్!
X

టాలీవుడ్ మిత్రవింద అదేనండీ..చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి రేపే. ఈ సందర్భంగా కాజల్ చేతులకు మెహిందీ పెట్టేసుకుని మురిసిపోయింది. పోనీ అలా ఊరుకుందా.. తన మురిపాన్ని అందరితో పంచుకుంది సోషల్ మీడియాలో! ఇంకేముంది.. ఆ మెహిందీ ఎర్రబడే లోపే ఆ ఫొటోలు ఫుల్ వైరల్‌గా మారాయి. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ గా చెలామణి అవుతున్న కాజల్ బిజినెస్‌మెన్ గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఏడడుగులు వేయనుంది. ముంబైలోని తన నివాసంలో ఈ పెళ్లి వేడుక జరుగుతుంది. అయితే కరోనా నేపధ్యంలో జరుగుతున్న పెళ్లి కావడంతో సినీ ఇండస్ట్రీకి సంబంధించి అతికొద్ది మంది మాత్రమే దీనికి హాజరుకానున్నారు.

ఇక చిన్నప్పటి నుంచి కూడా కాజల్, గౌతమ్ మంచి స్నేహితులు కావడం విశేషం.. అలా వీరి మధ్య స్నేహం ప్రేమకు దారీ తీసింది. ఇద్దరి ప్రేమకి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒకే చెప్పడంతో వీరు త్వరలోనే ఒకటి కాబోతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న క్రమంలో కాజల్ వివాహం చేసుకుంటుంది. ప్రస్తుతం కాజల్ మంచు విష్ణు మోసగాళ్ళు, చిరంజీవి ఆచార్య, కమల్ హసన్ ఇండియన్ 2, పారిస్ పారిస్‌ లాంటి సినిమాలను చేస్తోంది. ఇక పెళ్లి అయినప్పటికీ తానూ సినిమాలను చేస్తానని కాజల్ ఇప్పటికే ప్రకటించింది.

View this post on Instagram

🧿 #kajgautkitched 🧿

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on


Krishna

Krishna

Next Story