Kaira Advani: మెగా హీరోతో నటించడానికి 3 కోట్లు..!!

Kaira Advani: "భరత్ అనే నేను" చిత్రంలో ప్రిన్స్ మహేష్ సరసన హీరోయిన్ గా నటించిన కైరా అద్వాని ఆ చిత్రం ఘన విజయం

Sandeep Reddy
Published on: 7 July 2021 9:56 PM IST
Kaira Advani Takes 3 Crores Remuneration For RC15 Movie
X

కైరా అద్వాని

Kaira Advani: "భరత్ అనే నేను" చిత్రంలో ప్రిన్స్ మహేష్ సరసన హీరోయిన్ గా నటించిన కైరా అద్వాని ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ జోడిగా "వినయ విధేయ రామ" చిత్రంలో అవకాశం లభించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ఆఫర్లు లేక బాలీవుడ్ వెళ్ళిన ఈ భామ అక్కడ తాజాగా మరోసారి శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ 15వ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇటీవల కొన్ని వెబ్ సిరీస్ తో పాటు ఇండోకి జవాని, కబీర్ సింగ్ వంటి చిత్రాలతో మంచి హిట్ సాధించిన ఈ భామ ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ ని కూడా బాగానే పెంచినట్లు తెలుస్తుంది.

అటు తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ సినిమా కెరీర్ ని చక్కదిద్దుకుంటున్న కైరా అద్వాని.. రామ్ చరణ్ తో నటించబోయే ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగులో స్టార్ హీరోయిన్స్ సమంత ఇటీవల విడుదల అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో రాజీ పాత్రకి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా కాజల్ అగర్వాల్ మాత్రం 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే ఈ సినిమాలో కైరా అద్వాని నటించడానికి 3 కోట్లు ఇవ్వబోతున్నరనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మరోపక్క రామ్ చరణ్ అభిమానులు మాత్రం కైరా అద్వాని ని రామ్ చరణ్ 15 వ చిత్రానికి ఎంపిక చేయడంతో గతంలో హీరోయిన్స్ గా "వినయ విధేయ రామ" చిత్రంలాగే డిజాస్టర్ ఫలితం వస్తుందేమో అని కొంత టెన్షన్ పడుతున్నారు

Sandeep Reddy

Sandeep Reddy

Next Story