Prabhas's Salaar: ప్రభాస్ సాలార్ లో జ్యోతిక

Prabhas's Salaar: ప్రశాంత్ నీల్ తీస్తున్న సాలార్ మూవీలో ఓ కీలకమైన పాత్రకు జ్యోతికను ఒప్పించినట్లు తెలుస్తోంది.

Kranthi
Updated on: 20 May 2021 10:49 AM IST
Jyothika, now part of Prabhas’s Salaar project
X

Jyothika and Prabhas’s:(File Image)

Prabhas's Salaar:పాన్ ఇండియా మూవీ అంత ఈజీ కాదు. సినిమాను మార్కెట్ చేసుకోకపోతే.. పెట్టిన పెట్టుబడి కూడా రాదు. సినిమా ఎంత బ్రహ్మాండంగా తీసినా.. అనౌన్స్ చేసిన రోజు నుంచే దానికి బిల్డప్ ఇవ్వకపోతే.. భారీ సినిమాకు మనీ వెనక్కు వచ్చే పరిస్ధితి లేదు. అందుకే పాన్ ఇండియా మూవీలకు ఒక్కో ఎలిమెంట్.. ఒక్కొక్కటిగా బయటపెడుతూ హైప్ పెంచుతూ ఉంటారు. సాహో సినిమాతో దెబ్బ తిన్న ప్రభాస్.. ఈసారి మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రశాంత్ నీల్ తీస్తున్న సాలార్ మూవీలో ఓ కీలకమైన పాత్రకు జ్యోతికను ఒప్పించినట్లు తెలుస్తోంది. ముందు రమ్యకృష్ణ పేరు వినపడ్డా.. ఇప్పుడు జ్యోతిక ఫైనల్ అయినట్లు సమాచారం. దీంతో ఈ సినిమాకు తమిళ మార్కెట్ దొరికినట్లే. జ్యోతికను కలిసి ఆమె పాత్రను వినిపించారని.. కథ నచ్చడం.. పైగా పాన్ ఇండియా మూవీ కావడంతో జోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

కేజీఎఫ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్.. అంతే క్రేజ్ ఉన్న ప్రభాస్ తో జత కట్టడం.. ఇప్పుడు ఒక్కో లాంగ్వేజ్ లో ఒక్కో ఐకాన్ ను పట్టుకుని.. తమ సినిమాలో ఇన్ వాల్వ్ చేయడం ద్వారా.. పాన్ ఇండియా మూవీకి ఫుల్లు బిజినెస్ తెచ్చుకునే పనిలో పడ్డారు.

Kranthi

Kranthi

Next Story