Vakeel Saab: 'వకీల్ సాబ్'కి సుప్రీం కోర్టు జడ్జి కితాబ్

Vakeel Saab
x

వకీల్ సాబ్ ఫైల్ ఫోటో

Highlights

Vakeel Saab:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “వకీల్ సాబ్”.

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "వకీల్ సాబ్". ఈ సినిమా పింక్ అనే హిందీ సినిమాకు రీమేక్‌గా తెలుగులో వచ్చింది. ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే మేసెజ్ ఓరియేంటెడ్ చిత్రంగా నిలిచింది. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. మూడేళ్ల లాంగ్ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

ఇక రిలీజ్ అయిన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల, ప్రకాష్ రాజ్ కనిపించారు. దిల్ రాజు, బోణీ కపూర్ నిర్మించారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనపై తాజాగా సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖలో ఎముందంటే.. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ నటన అద్భుతం అని అలాగే పవన్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు ఇలాంటి సినిమా చెయ్యరని అన్నారు. అంతేకాదు సినిమాలో పవన్ నటించడం కాదు జీవించేశారని ప్రశంసించారు. ఈ సినిమాను దేవదాసు చిత్రంతో పోల్చారు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.

ఇక ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా దాదాపు ఫిక్స్ అయ్యిందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ కలెక్షన్స్ తగ్గడంతో బహుశా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. వకీల్ సాబ్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది.



Show Full Article
Print Article
Next Story
More Stories