Saranga Dariya Song: సారంగ దరియా ఒరిజినల్ సింగర్ కోమలికి న్యాయం

Saranga Dariya Song: సారంగ దరియా పాట వివాదంపై స్పందించిన లవ్‌స్టోరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల..

Sandeep Eggoju
Updated on: 10 March 2021 9:16 PM IST
Justice for Saranga Daria Original Singer Komali
X

ఫైల్ ఇమేజ్ 

Saranga Dariya Song: హెచ్ఎంటీవీ వరుస కథనాలతో సారంగ దరియా ఒరిజినల్ సింగర్ కోమలికి న్యాయం జరిగింది. సారంగ దరియా పాట వివాదంపై స్పందించిన లవ్‌స్టోరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కోమలికి క్రెడిట్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా ఇస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా కోమలికి ఇష్టమైతే లవ్‌స్టోరీ ఆడియో ఫన్షన్‌లో కోమలితో సారంగ దరియా పాడిస్తామన్నారు.

గత కొన్నిరోజులుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సారంగ దరియా పాటను మొట్ట మొటది సారిగా హెచ్ఎంటీవీ మార్మోగినపాటలో కోమలి పాడారు. దీంతో కోమలికి ప్రజల్లో మంచి గుర్తిపు వచ్చింది. ఆసమయంలో కోమలి పాట విపరీతంగా పాపులర్ కావడంతో కోమలికి మంచి క్రేజ్ వచ్చింది. అదే సమయంలో ఓ కార్యక్రమంలో సారంగ దరియా పాటను పాడింది కోమలి. ఆ కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరించిన సుద్దాల అశోక్ తేజ కోమలిపై ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా సారంగ దరియా పాటను ఉన్నత స్థాయికి తీసుకెళతానని మాటిచ్చారు.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత లవ్‌స్టీరీ సినిమా ద్వారా సారంగ దరియా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే చిత్ర బృందం కోమలిని విస్మరించింది. దీంతో కోమలి మళ్లీ హెచ్ఎంటీవీతో లైవ్‌లో తన గోడు చెప్పుకుంది. కోమలికి మద్దతుగా వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఎట్టకేలకు శేఖర్ కమ్ముల స్పందించారు. కోమలికి క్రెడిట్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కోమలి ఒప్పుకుంటే లవ్‌స్టోరీ ఆడియో ఫంక్షన్‌లో సారంగ దరియా పాడిస్తానని హామీ ఇచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story